Home వార్తలు ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం

0

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై చారిత్రాత్మక అధ్యయనాన్ని ప్రారంభించిన హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ

1,000 మంది పార్టిసిపెంట్స్ జీవక్రియ ఆరోగ్యం, పేగుల్లో సూక్ష్మజీవుల వైవిధ్యం, జీవసంబంధమైన వయస్సుపై బహుళ నగరాల్లో అధ్యయనం.

బెంగళూరు, నవంబర్‌ 03, 2026: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్ , బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, ‘ఆరోగ్యం & ఆనందం’ చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) చేతులు కలిపాయి.  ఐఐఎస్‌సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్‌, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.

భారత్‌లో  వయోజనుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఎంతకాలం జీవిస్తున్నారనే దానితో పాటు ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నారనే అంశాన్ని అర్థం చేసుకోవడంపై ఆసక్తి పెరుగుతోంది. పోషకాహారం, జీవనశైలి, జీవక్రియ ఆరోగ్యం యొక్క ప్రాధాన్యాన్ని శాస్త్రీయ పరిశోధనలు విస్తృతంగా  వెల్లడిస్తున్నప్పటికీ, సామాజిక సంబంధాలు, జీవిత లక్ష్యం, వెల్‌నెస్‌ సహాయక వ్యవస్థలు, జీవసంబంధమైన సూచికలు వంటి అంశాలు జీవక్రియ ఆరోగ్యం, మొత్తం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై ఇంకా పూర్తిస్థాయి అవగాహన లేదు.

‘హెల్త్‌ అండ్‌ హ్యాపీనెస్‌ స్టడీ’లో 1,000 మందికి పైగా పార్టిసిపెంట్స్ పాల్గొననున్నారు. ప్రతి ఒక్కరూ  సుమారు ఆరు నెలల పాటు ఈ అధ్యయనంలో భాగంగా ఉంటారు. బహుముఖ అంచనా విధానం ద్వారా శారీరక ఆరోగ్యం, జీవసంబంధమైన సూచికలు, పేగుల్లోని సూక్ష్మజీవుల సమ్మేళనం, పోషకాహారం, జీవనశైలి పద్ధతులు, శ్రేయస్సుకు సంబంధించిన సూచికలను ఈ అధ్యయనం పరిశీలించనుంది. తద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన అవగాహనను అందించడంతో పాటు ఆరోగ్యం, ఆనందం, వెల్‌నెస్‌పై మరింత లోతైన అవగాహనకు దోహదపడనుంది.

“సరైన పోషణ, చురుకుగా ఉండేలా ప్రోత్సహించే వ్యక్తులు లేదా నిరంతరం ఉత్సాహంగా ఉండేలా చేసే సమాజం యొక్క మద్దతు చుట్టూ ఉన్నప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని హెర్బలైఫ్ ఇండియా వద్ద మేము నమ్ముతాము” అని హెర్బాలైఫ్ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ ఖన్నా అన్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ప్రజలు రోజువారీ జీవితంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. దీనికి సంబంధించిన సమాధానం భారతీయుల జీవితాల నుంచే రావాలని కోరుకుంటున్నాం. ఐఐఎస్‌సీతో భాగస్వామ్యం ఈ తరహా పరిశోధనకు అవసరమైన శాస్త్రీయ కచ్చితత్వాన్ని అందిస్తుంది” అని అన్నారు.

“సమాజం, పోషకాహారం, రోజువారీ అలవాట్ల ప్రాధాన్యాన్ని చెప్పడం సులభమే. అయితే వాటిని శాస్త్రీయంగా నిరూపించడం అంత సులభం కాదు అని ఐఐఎస్‌సీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంటల్‌ బయాలజీ అండ్‌ జెనెటిక్స్‌ ప్రొఫెసర్‌ దీపక్‌ సైనీ అన్నారు . ఆయనే మాట్లాడుతూ  హెర్బాలైఫ్ ఇండియాతో ఈ భాగస్వామ్యం ద్వారా కాలక్రమంలో ప్రజల ఆరోగ్యంలో చోటుచేసుకునే వాస్తవ మార్పులను పరిశీలిస్తూ అర్థవంతమైన శాస్త్రీయ ఆధారాలను రూపొందించే అవకాశం మాకు లభించింది. స్వతంత్రంగా, విస్తృత స్థాయి పరిశోధనలు నిర్వహించడం, ఆధారాలు ఏ ఫలితాలను వెల్లడించినా వాటిని పారదర్శకంగా తెలియజేయడానికి  ఐఐఎస్‌సీ కట్టుబడి ఉంది. ఈ పరిశోధన ద్వారా లభించే పరిజ్ఞానం భారతీయులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే అంశాలపై లోతైన అవగాహన కల్పించగలదు. అలాగే వ్యక్తులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విధాన రూపకర్తలు మెరుగైన ఆరోగ్య నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది” అని తెలిపారు.

హెర్బాలైఫ్ ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ గురించి

హెర్బాలైఫ్ (ఎన్‌వైఎస్‌ఈ: హెచ్‌ఎల్‌ఎఫ్‌) ప్రముఖ ఆరోగ్య, వెల్‌నెస్‌ సంస్థ, కమ్యూనిటీ, ప్లాట్‌ఫామ్‌. ఇది 1980 నుంచి స్వతంత్ర పంపిణీదారులకు మెరుగైన పోషకాహార ఉత్పత్తులు, వ్యాపార అవకాశాలను అందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తోంది. ఈ సంస్థ 95 కంటే ఎక్కువ మార్కెట్లలోని వినియోగదారులకు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఆహార మరియు ఆహారేతర ఉత్పత్తులను అందిస్తుంది.  ఈ ఉత్పత్తులను స్వతంత్ర, వ్యవస్థాపక పంపిణీదారులు అందిస్తారు. ఈ పంపిణీదారులు వినియోగదారులకు వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేయడంతో పాటు, ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించే సహాయక సమాజాన్ని అందిస్తున్నారు.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) గురించి

జంషెడ్‌జీ నుస్సెర్వాన్జీ టాటా, మైసూరు రాజకుటుంబం, భారత ప్రభుత్వం భాగస్వామ్యంతో 1909లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) ఏర్పాటు చేయబడినది. గత 117 ఏళ్లలో ఐఐఎస్‌సీ భారతదేశంలో ఉన్నత స్థాయి శాస్త్రీయ పరిశోధన, విద్యకు ప్రముఖ సంస్థగా ఎదిగింది. 2018లో ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఐఓఈ)గా ఎంపికైన ఐఐఎస్‌సీ, ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో స్థిరంగా స్థానం పొందుతోంది. (sTORY: ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version