Home వార్తలు 600 కొత్త నియామకాలతో హైదరాబాద్‌ జీసీసీపై క్వాలీజీల్‌ ప్రత్యేక దృష్టి

600 కొత్త నియామకాలతో హైదరాబాద్‌ జీసీసీపై క్వాలీజీల్‌ ప్రత్యేక దృష్టి

0
Sunil Upadrasta, Vice President and India Head, GCC

600 మందికి పైగా కొత్త నియామకాలతో హైదరాబాద్‌ జీసీసీపై ప్రత్యేకంగా దృష్టి సారించిన క్వాలీజీల్‌

జీసీసీ ఇండియా హెడ్ గా సునీల్‌ ఉపద్రష్ట నియామకం

హైదరాబాద్‌, నవంబరు 3: ఏఐ-నేటివ్ క్వాలిటీ ఇంజనీరింగ్, ఏఐ అస్యూరెన్స్‌లో ప్రపంచ అగ్రగామి సంస్థ క్వాలిజీల్,  పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి హైదరాబాద్‌లోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ)పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 2028 నాటికి నగరంలో 600 మందికి పైగా కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), క్లౌడ్‌, డేటా ఇంజినీరింగ్‌, డిజిటల్‌ ఇంజినీరింగ్‌, ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్ల విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనుంది. జీసీసీ వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలను మరింత బలోపేతం చేసేందుకు, కొత్త వ్యాపార అవకాశాల సాధన, మార్కెట్‌ విస్తరణ, ఉన్నత స్థాయి సంస్థాగత నాయకులతో సంబంధాల బలోపేతం చేసుకునేందుకు సునీల్‌ ఉపద్రష్టను వైస్‌ ప్రెసిడెంట్‌, జీసీసీ ఇండియా హెడ్‌ గా నియమించింది.

క్వాలీజీల్‌కు హైదరాబాద్‌లో మూడు గ్లోబల్‌ డెలివరీ కేంద్రాలు (జీడీసీ) ఉన్నాయి. సంస్థలోని మొత్తం 1,100 మందికి పైగా ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మంది ఇక్కడే పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీలకు తరువాతి తరం ఇంజినీరింగ్‌, ఏఐ అస్యూరెన్స్‌ సేవలను అందించే కీలక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. జీసీసీ ప్రాజెక్టులకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించేందుకు 600 మందికి పైగా నియామకాలు చేపట్టనుంది.

ఈ సందర్భంగా క్వాలీజీల్‌ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, సీఈవో ప్రదీప్‌ గోవిందస్వామి మాట్లాడుతూ ‘‘సంస్థల వృద్ధి, ఆవిష్కరణల్లో జీసీసీలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. నాణ్యతా ఇంజినీరింగ్‌, డిజిటల్‌ ఇంజినీరింగ్‌, ఏఐ అస్యూరెన్స్‌ వంటి విభాగాల్లో సమగ్ర సేవలు అందించగల ప్రత్యేక భాగస్వాముల అవసరం పెరుగుతోంది. ఈ మారుతున్న అవసరాలను తీర్చేందుకు క్వాలీజీల్‌ తన సామర్థ్యాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోంది. జీసీసీలకు విశ్వసనీయమైన దీర్ఘకాలిక భాగస్వామిగా నిలవాలని భావిస్తున్నాం’’ అని తెలిపారు.

అటోస్‌ సింటెల్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), రిలయన్స్‌ రిటైల్‌ సంస్థల్లో కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన సునీల్‌ ఉపద్రష్టకు సాంకేతిక రంగంలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తన కొత్త బాధ్యతలపై సునీల్‌ ఉపద్రష్ట మాట్లాడుతూ ‘‘ ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడంతో పాటు ఆయా సంస్థలు అభివృద్ధి చేసే వ్యవస్థలు విశ్వసనీయంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా ఉండేందుకు కృషి చేస్తాం. జీసీసీలతో కలిసి కొత్త పరిష్కారాలను అభివృద్ధి చేయడం, వాటి పూర్తి యాజమాన్యాన్ని ఆయా సంస్థలకే అప్పగించడం ద్వారా ఆవిష్కరణలను వేగవంతం చేయడంతో పాటు నష్టభయాలను సమర్థంగా నిర్వహించుకునేందుకు తోడ్పడగలం’’ అని వివరించారు. (sTORY: 600 కొత్త నియామకాలతో హైదరాబాద్‌ జీసీసీపై క్వాలీజీల్‌ ప్రత్యేక దృష్టి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version