కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది
న్యూస్ తెలుగు/వనపర్తి : రెండవ విడత ఎన్నికల ప్రచారంలో వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు శుక్రవారం వనపర్తి మండలం లోని పాలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారుకాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తేనే గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని ఎదుర్కొంటామని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వనపర్తి మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అప్పాయిపల్లి, కీర్యతండా, కాశీంనగర్, కాశీంనగర్ తాండ, చిట్యాల పెద్దగూడెం, దత్తాయిపపల్లి, చందపురం, మెంటేపల్లి, కడుకుంట్ల, కిష్టగిరి, కిష్టగిరి తాండ, పెద్దగూడెం తాండ, నాచ హళ్లి తో పాటు పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామానికి ప్రచారీకి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు
డోలు డప్పులతో నృత్యాలు చేస్తూ నుదుటన తిలకం దిద్ది మంగళహారతి ఇస్తూ మహిళలు సైతం ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రాష్ట్రంలో మరో పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ప్రస్తుతం మూడేళ్లు తాను ఎమ్మెల్యేగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు రవి గారు ఎంపీగా ఉంటారని గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులనే అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే సూచించారు
పదేళ్ల BRS పాలనలో గ్రామాలలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని
ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కేవలం అభివృద్ధి పనుల మాటున అందిన కాడికి దోచుకున్నారే తప్ప గ్రామాలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు
నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు
మహిళలకు వడ్డీ లేని రుణాలు
మహిళలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం
మహిళా సమైక్యలకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు
మన ఇంటికి ఉపయోగించే ఉచిత విద్యుత్తు
రైతు భరోసా
రైతు రుణమాఫీ
హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు
రైతులకు రాయితీపై విత్తనాలు యాంత్రిక పనిముట్లు లాంటి అనేక పథకాలు చేపట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ప్రస్తుతం కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలలో పూర్తిస్థాయి అభివృద్ధి కొనసాగుతుందని మీరు గెలిచి వస్తే నేను అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థులకు సూచించారు
విద్యాపరంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
వైద్యపరంగా నూతన ఆసుపత్రుల నిర్మాణం
అంతర్గత రోడ్ల నిర్మాణం
విద్యుత్ సమస్యల పరిష్కారం
తాగునీటి సమస్యల పరిష్కారం
గ్రామాలలో మౌలిక వసతుల కల్పన లాంటి అనేక పనులు చేపడుతున్నామన్నారు
గతంలో నుంచి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇతరులను నమ్మి మోసపోకూడదని ఎమ్మెల్యే సూచించారు
కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి మాజీ zptc గొల్ల వెంకటయ్య ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(story : కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం )

