Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ చింతూరు బస్సు ప్రమాదం ఘటన పై మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దిగ్భ్రాంతి

 చింతూరు బస్సు ప్రమాదం ఘటన పై మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దిగ్భ్రాంతి

 చింతూరు బస్సు ప్రమాదం ఘటన పై మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దిగ్భ్రాంతి

న్యూస్ తెలుగు/సాలూరు :  అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పలువురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం వారు,సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర ఆలయంలో చనిపోయిన భక్తులకు 15 లక్షలు ఇచ్చారు కాబట్టి ఈ బస్సు ఘటనలో చనిపోయిన వారు కూడా తీర్ధ యాత్రలకు వెళ్లే భక్తులే కాబట్టి వారికి కూడా 15 లక్షలు తక్కువ కాకుండా ఆర్థిక సాయం ఇవ్వాలని తెలిపారు. బస్సు ప్రమాద క్షతగాత్రులకు ప్రభుత్వమే బాధ్యత వహించి వారు వైద్యం పొందుతున్న ప్రభుత్వ లేక ప్రైవేటు ఆసుపత్రులలో పూర్తిగా నయం అయ్యే వరకు ఖర్చులు ప్రభుత్వమే భరించాలని మనవి చేసారు. ప్రమాదం జరిగిన ఘాట్ రోడ్ లో మరియు ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో పోలీసు శాఖ వారు ఆర్ అండ్ బి శాఖ వారు హెచ్చరిక బోర్డులు పెడితే భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం తగవచ్చని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి కూడా దీనిపై శ్రద్ధ వహించి ప్రమాదకర మలుపులు వంటి ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనలో మృతుల,కుటుంబాలు క్షత్రగాత్రుల కుటుంబాలు ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురుచూస్తున్నాయని సీఎం, డిప్యూటీ సీఎం,రవాణా శాఖ మంత్రి కి మనవి చేశారు. ఈ ఘటన ప్రాంతానికి సంబంధించిన వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బాధితులకు క్షేత్రగాతులకు సహాయక చర్యలు అందించాలని కోరారు. ఈ లోయలో పడిన బస్సు ఘటనను ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి బస్సుకు ఇన్సూరెన్స్ ఉంటే యాత్రికులకు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలానికి ప్రభుత్వం వెంటనే వైద్య బృందం పంపించి, సహాయక చర్యలు ముమ్మరం చేసి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి పంపించవలసిన అవసరం ఉందని తెలిపారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతం,ఆంధ్రా ఊటీ అని చెప్పుకునే పర్యాటక ప్రాంతం కాబట్టి ప్రస్తుతం ఉన్న రోడ్లను వెడల్పు చేసి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కోరారు.(Story : చింతూరు బస్సు ప్రమాదం ఘటన పై మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దిగ్భ్రాంతి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!