Homeవార్తలుతెలంగాణనూతన సర్పంచు విజేతలకు ఘన సన్మానం

నూతన సర్పంచు విజేతలకు ఘన సన్మానం

నూతన సర్పంచు విజేతలకు ఘన సన్మానం

న్యూస్ తెలుగు/వనపర్తి :మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన బి.ఆర్.ఎస్ 34మంది సర్పంచులను మరియు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అధికార పార్టీ అరాచకాలకు దౌర్జన్యాలకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికలలో ప్రస్పుటించిందని రాబోయేది బి.ఆర్.ఎస్ ప్రభుత్వము అని స్పష్టమైందని అన్నారు.గెలిచిన సర్పంచులు కష్టపడి పని చేసి ప్రజల మన్ననలు పొందాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ప్రభుత్వంలో అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.(Story : నూతన సర్పంచు విజేతలకు ఘన సన్మానం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!