బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం : ఎస్ఐ రమేష్
న్యూస్‌తెలుగు/ చింతూరు : బాల్య వివాహాలు చేయటం చట్టరీత్య నేరమని చింతూరు ఎస్సై పి రమేష్ పేర్కొన్నారు.బాల్య వివాహ నిరోధక కమిటీ సమావేశం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎస్సై పాల్గొని ప్రసంగించారు. బాలల హక్కులు చట్టాల గురించి వివరించారు. మండల, గ్రామస్థాయి బాల్య వివాహ నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిఓ ఎంఎస్ నెంబర్ 1 మరియు జీవో ఎంఎస్ నెంబర్ 31 కోసం అవగాహన కల్పించారు.
ప్రతి నెల మొదటి, మూడో శుక్రవారం విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం విధిగా నిర్వహించాలని ఆ సమావేశంలో ప్రతి కిషోర బాలిక, బాలుర హక్కుల కోసం చర్చించాలని, 0 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు విద్యను అభ్యసించాలని చెప్పారు.
ఎంపీడీవో సుండం శ్రీనివాస్ దొర మాట్లాడుతూ గ్రామంలో డ్రాప్ ఔట్స్ సర్వే నిర్వహించాలని, పిల్లలు డ్రాప్ ఔట్స్ అవ్వడానికి గల కారణాలను విపులంగా వివరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో డిఎల్ పి ఓ ,, సిడిపిఓ ,, డిప్యూటీ ఎంపీడీవో ,గ్రామ సచివాలయ కార్యదర్శులు, వీఆర్వోలువి ఆర్ ఓ లు, ఎ యన్ యం లు, జి యం యస్ కె లు, అంగన్వాడి వర్కర్స్ పాల్గొన్నారు.(Story:బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం : ఎస్ఐ రమేష్)

