Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఓటు అనే ఆయుధాన్ని ప్రజల చేతికి అందించిన దార్శనికుడు అంబేద్కర్

ఓటు అనే ఆయుధాన్ని ప్రజల చేతికి అందించిన దార్శనికుడు అంబేద్కర్

ఓటు అనే ఆయుధాన్ని ప్రజల చేతికి అందించిన దార్శనికుడు అంబేద్కర్

న్యూస్ తెలుగు/చింతూరు : భారత రాజ్యాంగ నిర్మాత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా:బీఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి వేడుకలు చింతూరు లో డా:బీఆర్ అంబేద్కర్ దళిత కుటుంబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సంఘం సలహాదారులు లాడే శ్రీనివాసరావు మాట్లాడుతూ డా:బీఆర్ అంబేద్కర్ అంటే కేవలం ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందిన వారు కాదని,అన్ని వర్గాల వారికీ వారి ఆర్థిక స్థితి గతులను బట్టి రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు అని కొనియాడారు. అదేవిధంగా ప్రతీ పౌరుడికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిన మహనీయుడని, మహాత్మా గాంధీ ఓటు హక్కు కేవలం పన్నులు ఎవరైతే కడతారో వారికీ మాత్రమే ఇవ్వాలని,జవహర్ లాల్ నెహ్రు వంద ఎకరాల భూములు కలవారికి,రాజుల కుటుంబాల ప్రజలకి ఇవ్వాలని చెప్పగా డా :బీఆర్ అంబేద్కర్ మాత్రం కులమత బేధాలు చూడకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఇవ్వాలని గొంతెత్తి చాటి చెప్పడంతోనే ఓటు అనే ఆయుధం మన చేతికి వచ్చిందని తెలిపారు.తదనంతరం సంఘ ప్రధాన కార్యదర్శి ఇంటి సుదర్శన్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకోని వెళ్లే వారసులుగా ఎదగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మాజీ అధ్యక్షులు మళ్లెం నాగేంద్ర,సలహా దారులు హరవింద్ బాబు,చదలవాడ కృపాకర్,అంబేద్కర వాది మాధుసూదన్,సంఘ ఉపాధ్యక్షులు నక్కా రజనీ కుమార్,గుబ్బల ఆనంద్,కొట్టె సురేష్,కిరణ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.(Story:ఓటు అనే ఆయుధాన్ని ప్రజల చేతికి అందించిన దార్శనికుడు అంబేద్కర్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!