ఘణంగా ఉపాధ్యాయురాలు గొంప సుశీల వర్ధంతి
మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ
న్యూస్ తెలుగు /సాలూరు : సాలూరు పట్టణానికి చెందిన గొంప.సుశీల(టీచర్) వర్ధంతి సందర్భంగా ఆమెభర్త రాష్ట్ర రిపబ్లిక్ ఇన్ పార్టీ కార్యదర్శి గొంప ప్రకాశరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం పీడిక.రాజన్నదొర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం పెద్ద హరిజన పేట అంబేద్కర్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజన్నదొర ముందుగా అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి అంజలి ఘటించారు.అనంతరం.అంబేద్కర్ భవనంలో వర్ధంతి సభ ను ఉద్దేశించి మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతు గతంలో గొంప సుశీల ఉపాధ్యాయురాలుగా విద్యార్థుల కు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.అలాగే గొంప ప్రకాశరావు తన భార్య వర్ధంతి ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారని మెచ్చుకున్నారు.అనంతరం మాజీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పెద్దవీధీకి చెందిన సుమారు 130 మంది పేదలకు చీరలు దుప్పట్లు అందజేశారు. ఆదివాసి వికాస్ పర్షిత్ రాష్ట్ర అధ్యక్షుడు తబిటయ్య, వైసిపి లీడర్ రాజు, మత్స్యకారుల సంఘం చైర్మన్ జోగారావు తదితరులు పాల్గొన్నారు.(Story :ఘణంగా ఉపాధ్యాయురాలు గొంప సుశీల వర్ధంతి )

