Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పారామెడికల్ విద్యార్థినులకు శక్తి యాప్ మీద అవగాహన సదస్సు

పారామెడికల్ విద్యార్థినులకు శక్తి యాప్ మీద అవగాహన సదస్సు

పారామెడికల్ విద్యార్థినులకు శక్తి యాప్ మీద అవగాహన సదస్సు

న్యూస్‌తెలుగు/ అనంతపురం :  విద్యార్థినుల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచం శక్తి యాప్ బాలికల రక్షణకు ఆపద సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని శక్తి యాప్ ఆవశ్యకత, వినియోగం గురించి అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి మహబూబ్బాషా పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారామెడికల్ విద్యార్థినులకు శక్తి యాప్ మీద అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా డిఎస్పి మహబూబ్బాషా మాట్లాడుతూ… మహిళలు చిన్నారులపై జరిగే నేరాలు సైబర్ మోసాలపై డయల్ 100,112, చైల్డ్ లైన్ 1098, గృహహింస 181, మహిళల వేధింపులు 1091, సైబర్ టోల్ ఫ్రీ 1930, సైబర్ మిత్ర సంబంధిత పోలీసు వారిని తక్షణమే సంప్రదించి పోలీస్ వారు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థిని తమ సెల్ ఫోన్లో ప్లే స్టోర్ నందు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని వ్యక్తిగత వివరాలు ఫోన్ నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఎస్ ఓ ఎస్ బటన్, డయల్ 100/112 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే పది నిమిషాల్లో మీ చెంతకు సంబంధిత పోలీస్ అధికారులు చేరుకొని మీ యొక్క సమస్యను ఆపదను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా పి సి పి ఎన్ డి టి ఆక్ట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, పిల్లల మీద లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు మీద అవగాహన కలిగి ఉండాలన్నారు . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపర్ఇంటెండెంట్ డా.కే. ఎల్ సుబ్రహ్మణ్యం, ఇంచార్జి ఆర్ ఎం ఒ డా. జి హేమలత, స్టాఫ్ నర్స్ లత, భాగ్యరాణి, నరేష్, శోభ, కృష్ణవేణి, సరోజ, 400 మంది మెడికల్ మరియు పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.(Story:పారామెడికల్ విద్యార్థినులకు శక్తి యాప్ మీద అవగాహన సదస్సు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!