బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య ఘన నివాళులు
న్యూస్‌తెలుగు/ అనంతపురం : బిఆర్ అంబేద్కర్ సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య నఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు డా, బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ, స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బంగారు భాష, నాయి బ్రాహ్మణ వృత్తిదారుల సమాఖ్య నగర అధ్యక్షులు గోవిందరాజులు విశ్వబ్రాహ్మణ నాయకులు లక్ష్మీనారాయణ, గొర్ల మేకల పెంపకదారుల సంఘం నాయకులు రాము, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. (Story:బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య ఘన నివాళులు )

