Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో... 10 మందికి ఆపరేషన్‌కు ఎంపిక, 70 మందికి మందులు...

శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో… 10 మందికి ఆపరేషన్‌కు ఎంపిక, 70 మందికి మందులు పంపిణీ

శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

10 మందికి ఆపరేషన్‌కు ఎంపిక, 70 మందికి మందులు పంపిణీ

న్యూస్ తెలుగు/వినుకొండ :

వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయం నందు పెదకాకాని శంకర్ కంటి ఆసుపత్రి మరియు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించి, ఆపరేషన్ చేయించుకున్న వారికి మందులు, కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. పరీక్షించి వారిలో 10 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి 70 మందికి ఉచితంగా మందులు మరియు కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా జీవి ఆంజనేయులు- లీలావతి దంపతులు అందిస్తున్న సేవ కార్యక్రమం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది దర్శి వెంకటేశ్వరరావు, దిలీప్, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.(Story:శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో… 10 మందికి ఆపరేషన్‌కు ఎంపిక, 70 మందికి మందులు పంపిణీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments