కాంగ్రెస్ అరాచక పాలనతో రాష్ట్రం అధోగతి
న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రజలకు అండగా నిలిచిన మాగంటి.గోపీనాథ్ భార్య మాగంటి.సునీతను ఆదరించి ఆశీర్వదించాలని జూబ్లిహిల్స్ ప్రజలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. నాయకులతో కలసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదని ఘాటుగా విమర్శించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానకరంగా మాట్లాడిన మంత్రులు మహిళలకు క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లిహిల్స్ తో పాటు హైదరాబాద్ నగరాని అభివృద్ధి చేసిన కె.సి.ఆర్ బలపరిచిన సునితమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు పాల్గొనగలరు.(Story : కాంగ్రెస్ అరాచక పాలనతో రాష్ట్రం అధోగతి )

