రాజప్రసాదం పనులు త్వరగా మొదలు పెట్టండి
న్యూస్ తెలుగు/వనపర్తి : రాజప్రసాదానికి వచ్చిన జీవోలు మూడు…,. మొదటిసారి వచ్చిన డబ్బులు 22.5 కోట్లు…… దానిలో 8.5 కోట్లకు మొదటిసారి టెండర్ అయి ఉండే…….. ప్రభుత్వం మారాక అన్ని తిరోగమనం….ఇప్పుడు వచ్చిన డబ్బులు పదమూడున్నర కోట్లు…….మూడు సంవత్సరాలుగా అయిన పని శూన్యం….ఐదు సంవత్సరాలుగా రాజప్రసాదాన్ని కాపాడాలని అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెత్తి నోరు మొత్తుకుంటే అప్పటి ప్రభుత్వంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ , మాజీ మంత్రి కరుణించి జీవో విడుదలకు కష్టపడ్డారు. కానీ మూడేళ్ల నుండి జీవోలతోనే సరిపెడుతున్నారుఅని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి….అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. రాజప్రసాదం పనులు త్వరగా మొదలు పెట్టండి ఎమ్మెల్యే వనపర్తి కిరీటాన కిలికితురాయి పాలిటెక్నిక్ భవనము దాన్ని రక్షించే బాధ్యత పాలకులదే. ఇప్పటికే విద్యార్థులు హాస్టల్లో లేక తగిన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు కనుక జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే మరొక జి . ఓ తీసుకువచ్చి ఆ పనులను ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎవరు చేసినా ప్రజల కోసమే కనుక దీనిలో రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలని అందర్నీ కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, రామస్వామి, నాగరాజు, లక్ష్మణ్, శ్రీనివాసులు, నరేష్ ,సురేష్, తదితరులు పాల్గొన్నారు.(Story : రాజప్రసాదం పనులు త్వరగా మొదలు పెట్టండి )

