ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
శ్రీశైలం ప్రాజెక్ట్‌లో శవాన్ని పడేసి ఘోర నాటకం
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణ పోలీస్టేషన్ పరిధిలో పానుగల్ రోడ్డు గణేష్ నగర్ కు చెందిన నాగమణి ప్రియుడు శ్రీకాంత్ లను భయంకరమైన హత్య కేసులో నిందితులుగా గుర్తించారు. ప్రియునితో కలిసి ఆమె భర్తను అక్టోబర్ 25వ తేదీన రాత్రి సమయంలో మద్యంతో మత్తెక్కించి, కూలర్ తాడు సహాయంతో కురుమూర్తిని గొంతు బిగించి హత్య చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకుని శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో శవాన్ని పడేసి, అనుమానం రాకుండా వనపర్తి పట్టణ పోలీస్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ పోలీసుల క్షుణ్ణ దర్యాప్తు, టెక్నికల్ సాక్ష్యాలు, సీసీటీవీ ఆధారాలతో నిందితులు దొరికిపోయారు.నేరం ఎంత చాకచక్యంగా చేసినా నిజం బయటపడుతుందనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
నిందితుల వివరాలు
A1- కేకుల నాగమణి
A2- నందిమల్ల శ్రీకాంత్ నందిమల్ల గడ్డ, మెట్టుపల్లి వనపర్తి.
ఈ కేసును చేదించడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సీఐ, కృష్ణయ్య, వనపర్తి పట్టణ ఎస్సైలు, హరిప్రసాద్, శశిధర్, చిన్నంబావి ఎస్సై, జగన్,ఎస్పీకార్యాలయం ఎస్సై, రాము, మరియు పోలీసుకానిస్టేబుళ్లు, నవీన్ గౌడ్, అభిషేక్ లను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో వనపర్తి డిసిఆర్బి డిఎస్పి, ఉమామహేశ్వరరావు, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు, వనపర్తి సిఐ, కృష్ణయ్య, వనపర్తి పట్టణ ఎస్సైలు, హరిప్రసాద్, శశిధర్, ఎస్పీ కార్యాలయం ఎస్సై, రాము, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.(Story : ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య )

