Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పాలాభిషేకం

అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పాలాభిషేకం

అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పాలాభిషేకం

న్యూస్ తెలుగు /సాలూరు :అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పాలాభిషేక కార్యక్రమం సాలూరు పట్టణంలో జరిగింది. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా సాలూరు అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని చేశారు. సాలూరు పట్టణం, సాలూరు మండలం, రామభద్రపురం, పాచిపెంట, మక్కువ మండలాల నుంచి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి అయ్యప్ప స్వాములు వారి సన్నిధానాల నుండి పాల కావిళ్ళు తో, బిందెలతో బయలుదేరి వారి వీధిలో, గ్రామాల్లో ఊరేగించుకొని ప్రజలు వేసిన పాలను తీసుకొని వచ్చారు.. ఈ పాలను అయ్యప్ప స్వాములు భజనలు, కోలాటం చేసుకొని ఊరేగింపుగా అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం చిన్న బజార్, గొల్ల వీధి, మెయిన్ రోడ్డు, డబ్బి వీధి, పెద్ద కోమటిపేట, కోటవీధి జంక్షన్ ఎన్టీఆర్ డీలక్స్ నుండి అయ్యప్ప స్వామి ఆలయం వరకు సాగింది. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయం కు చేరుకుని స్వామివారి విగ్రహానికి ఈ తెచ్చినటువంటి పాలతో అభిషేకం చేశారు. ఈ పాలాభిషేకం చేయడంతో వేలాదిమంది అయ్యప్ప స్వామి భక్తులు ఆనందంతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం చేశారు.(Story : అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పాలాభిషేకం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!