ఉచిత త్రీ వీలర్ కు దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : అర్హులైన దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉచితంగా త్రీ వీలర్ మోటార్ సైకిల్ లను అందజేస్తుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కోరారు. www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో ఈనెల 25 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వినుకొండ నియోజకవర్గంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా చీఫ్ విప్ కార్యాలయంలో ఆన్లైన్ దరఖాస్తు చేయడం జరుగుతుందని, అందుకు ప్రత్యేకంగా కార్యాలయంలో సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, రెగ్యులర్ డిగ్రీ, ఆపై ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు, పదోతరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధితో జీవించే దివ్యాంగులు 18 నుండి 45 ఏళ్ల లోపు 70 శాతం అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యారత సర్టిఫికెట్ తో పాటు, సదరం సర్టిఫికెట్, రేషన్, ఆధార్ కార్డులతో దివ్యాంగులు చీఫ్ విప్ కార్యాలయంలో సిబ్బందిని సంప్రదించి ఉచితంగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని నియోజకవర్గ అర్హులైన దివ్యాంగుల అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.(Story :ఉచిత త్రీ వీలర్ కు దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి )

