వినుకొండలో గొడవలు సృష్టిస్తున్న బొల్లా
ఐదేళ్లలో అనేక ఆకృత్యాలకు పాల్పడిన వైసిపి
చీఫ్ విప్ జీవి పై ఆరోపణలు తగవు
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రశాంతంగా ఉన్న వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం దారుణమని టిడిపి నాయకులు మండిపడ్డారు. సోమవారం రాత్రి చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పోలీసులపై, ప్రజా ప్రతినిధులపై చేసిన నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత నెల 16వ తేదీన వినకొండ పట్టణంలో జరిగిన వివాహ వేడుకలు, ఊరేగింపులో కొందరు వైసిపి శక్తులు మద్యం సేవించి వైసిపి జెండాలు, జగన్ పాటలు డీజే పెట్టి కవింపు చర్యలకు పాల్పడితే అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దౌర్జన్యం చేసి వారి విధులకు ఆటంకం కలిగించడం దారుణం అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావులపై ఆరోపణలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టం అంటూ ఎంఎన్ ప్రసాదు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. వైసిపి పాలనలో పోలీస్ స్టేషన్కు వెళితే వైసీపీ నాయకులయితేనే స్టేషన్ మెట్లు తొక్కండి అని నియంతల వ్యవహరించిన వ్యక్తులు మీరు కాదా అని నిలదీశారు. 2014-19 వరకు ప్రశాంతంగా ఉన్న వినుకొండను 2019-24 వరకు వైసిపి ఆకృత్యాలకు హద్దు లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గంలోని టిడిపి నాయకులు కార్యకర్తలపై బ్రహ్మనాయుడు అక్రమ కేసులు పెట్టించడమే కాక, దౌర్జన్యాలు దాడులు కూడా చేయించారని అన్నారు. వైసిపి పాలనలో దుర్మార్గాలు తట్టుకోలేక టిడిపి నాయకులు కుటుంబాలతో సహా గ్రామాలు వదిలి వెళ్లిన సంఘటనలు ఉన్నాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఎక్కడా లేదని, శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. వివాహ వేడుకల్లో పార్టీ జెండాలు కట్టడం, డీజేలో పార్టీ పాటలు పెట్టడం, జీవి డౌన్ డౌన్ ఇదంతా బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థపు రాజకీయ కుట్రలో భాగం కాదా అని ప్రశ్నించారు. మద్యం సేవించి కొందరు వైసీపీ కార్యకర్తలు చేసిన గొడవను ముస్లిం సమాజానికి ఆపాదించడం దుర్మార్గమన్నారు. ఇటువంటి దృశ్చర్యలను కూటమి ప్రభుత్వం సహించదని, దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సమావేశంలో టిడిపి నాయకులు లాయర్ రామకోటేశ్వరరావు, సైదారావు, షమీం ఖాన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళి, పెమ్మసాని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.(Story :వినుకొండలో గొడవలు సృష్టిస్తున్న బొల్లా )

