బాబు జగజ్జీవన్ రామ్ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు ఇవ్వండి
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక జగజ్జీవన్ రామ్ కాలనీ ప్రభుత్వ భూమిలో ఇళ్లు వేసుకుని గత 15 ఏళ్లుగా నివాసముంటున్నాము. మీరే విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి సహకరించారు. అలాగే ఇంటి పట్టాలు కూడా మంజూరు చేసి మాకు చట్టబద్ధత కల్పించాలంటూ ఆ కాలనీ పేద కుటుంబాలు మంగళవారం నాడు చీప్ విప్ కార్యాలయానికి వచ్చి సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులుకు మొరపెట్టుకొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పేద కుటుంబాలు తాము ఆ కాలనీలో గత పదిహేనేళ్లుగా నివసిస్తున్నామని, కూలి పనులకు వెళ్ళందే తమకు పూట గడవదని, తమరి హయాంలోనే గతంలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేశారని, అయితే కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, మరి కొంతమందికి విద్యుత్ సౌకర్యం లేదని, అదనపు విద్యుత్ స్తంభాలు వేసి వారికి కూడా విద్యుత్ సౌకర్యం కల్పించి, అలాగే ఇళ్ల పట్టాలు మంజూరు చేయించి తమకు చట్టబద్ధత కల్పించాలని, సుమారు 500 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నామని వారు జీవికి మొరపెట్టుకున్నారు. స్పందించిన చీఫ్ విప్ జీవి అక్కడే ఉన్న తాసిల్దార్ సురేష్ నాయక్ ను పిలిపించి పరిస్థితిని వివరించారు. తక్షణం ఆ కాలనీని పరిశీలించి అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేసి కనీస వసతులు కల్పించాలని తాసిల్దార్ సురేష్ నాయక్ ను ఆదేశించారు. దీంతో ఆ కుటుంబాలు చీప్ విప్ జీవికి కృతజ్ఞతలు తెలిపి వెనుతిరిగారు. ఈ వినతి పత్రం ఇచ్చిన కార్యక్రమానికి పులి నాగేంద్రం, పులి రాజమ్మ, బి.అచ్చమ్మ నాయకత్వం వహించారు.(Story : బాబు జగజ్జీవన్ రామ్ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు ఇవ్వండి)

