నరగాయపాలెం గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం
న్యూస్ తెలుగు/వినుకొండ : పాడి పశువులు ఉన్న రైతులు పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ మండలం పశువైద్య అధికారి డాక్టర్ పి అమీర్ బాషా తెలిపారు.వినుకొండ మండలంలోని నరగాయపాలెం గ్రామంలో ఐటిసి బైఫ్ అధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా 34 గేదేలకు గర్బకోశ,చూడి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ పి అమీర్ బాషా మాట్లాడుతూ పాడి రైతులకు ఇటువంటి పశువైద్య శిబిరాలు ఆర్థికంగా తోడ్పాటునందిస్తాయని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా పాడి రైతులకు మినరల్ మిక్చర్స్,నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది శివ శంకర్,బైఫ్ పశువైద్య సిబ్బంది రాజశేఖర్ , శ్రీను పాల్గొన్నారు.(Story : నరగాయపాలెం గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం )

