వినుకొండ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
వరద బాధితులకు సేవలు అందించిన అధికారులకు అభినందనలు
ప్రతి ఇంటిపై సోలార్ పెట్టించాలి
ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు చేయించాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గ ప్రజలకు అధికారులు, ఉద్యోగులు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. మంగళవారం చీఫ్ విప్ కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. మొంధా తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో నష్టం జరిగిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు సమర్ధవంతంగా పనిచేసే వరద ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి తగిన సేవలు అందించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు నియోజకవర్గంలోని గ్రామాల్లో పంటలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి యాప్ లో అప్లోడ్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందన్నారు. వర్షం ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు వరగటం, ట్రాన్స్ఫార్మర్ల వద్ద షార్ట్ సర్క్యూట్, విద్యుత్ పోల్స్ విరిగిపోవడం లాంటి సంఘటనలు జరిగి ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసి విద్యుత్ శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని కొనియాడారు. రెవిన్యూ, మున్సిపాలిటీ,ఎలక్ట్రికల్, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖ, ఆర్టీసీ వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు సిబ్బంది స్పందించి తుఫాన్ సమయంలో ప్రజలకు మంచి సేవలు అందించారని అన్నారు. గ్రామాల్లో అంటూ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య మెరుగు చర్యలు తీసుకోవాలని చీఫ్ విప్ చీఫ్ జీవి ఆదేశించారు. మూగజీవాలకు వ్యాధులు రాకుండా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, వైద్య అధికారులు సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కూటమి ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇస్తుందని వరులు అవగాహన పెంపొందించి ఉచిత కరెంటు మీటర్లు ఏర్పాటు చేయాలన్నారు. నివేషణ స్థలాలకు దరఖాస్తులు చేసిన వారికి రెవిన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేయాలని, నివేషణ స్థలం లేని వారిని గుర్తించి ప్రతి ఒక్కరితో ఇంటి స్థలం దరఖాస్తులు పెట్టించాలని, స్థలం ఉన్న వాళ్లకు పట్టాలు ఇచ్చి హౌసింగ్ కి దరఖాస్తు పెట్టించాలని కోరారు. నియోజకవర్గంలో పట్టాదారు పాస్ పుస్తకాలకు దరఖాస్తులు 6000 పెండింగ్లో ఉన్నాయని వెంటనే పరిష్కరించాలని తాసిల్దార్లను ఆదేశించారు. సూర్య ఘర్ పథకం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని, సూర్య ఘర్ పేదలకు ఆదాయ వనరు అని తెలిపారు. అధికారులు ప్రజల్లో అవగాహన పెంపొందించి ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్స్ ను పెట్టించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో ఉద్యాన పంట సాగును ప్రోత్సహించాలని, 17వేల ఎకరాల హార్టికల్చర్ పండ్లను వేసేందుకు రైతులను సిద్ధం చేసిన అధికారులను ఆయన అభినందించారు. అనంతరం మొంధా తుఫాను బాధ్యతలకు మెరుగైన సేవలందించిన ఉత్తమ అధికారులను ఆయన సన్మానించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు స్పెషల్ ఆఫీసర్ మూర్తి, ఓ ఎస్ డి సుబ్బారావు, కూటమి నేతలు లగడపాటి వెంకట్రావు, పెమ్మసాని నాగేశ్వరరావు, కొనిజేటి నాగ శ్రీను, బొంకూరి రోశయ్య, సుధాకర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.(Story :వినుకొండ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి )

