వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జాషువా జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక వైసిపి కార్యాలయంలో ఆదివారం పద్మ భూషణ్, కళా ప్రపూర్ణ, కవికోకిల, కవితా విశారద, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.(Story:వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జాషువా జయంతి వేడుకలు)

