డబల్ ఇంజన్ సర్కార్ వారు మాట్లాడిన తీరు అహంకార పూరితంగా ఉన్నాయి
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
న్యూస్ తెలుగు /వినుకొండ : డబుల్ ఇంజన్ సర్కార్ సభ్యులు బాలకృష్ణ, కామినేని శ్రీనివాసరావు అసెంబ్లీలో వారు మాట్లాడిన మాటలు అహంకార పూరితంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఆదివారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అని సంబోధించడం, సినీ నటులు చిరంజీవిని కూడా అపహాస్యం చేసి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఆనాడు చిరంజీవి సినీ పరిశ్రమ పెద్దలు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో మర్యాదపూర్వకంగా, గౌరవం ఇచ్చారని బ్రహ్మనాయుడు గుర్తు చేశారు. అలాగే అసెంబ్లీలో హోం శాఖ మంత్రి అనిత నోటి నుండి దమ్ము ఉందా, ధైర్యం ఉందా అనే పదాలు రావడం విచారకరమన్నారు. ఇక వినుకొండ శాసనసభ్యులు, చీప్ విప్. జీవి ఆంజనేయులు వినుకొండలో మాట్లాడిన తరహా లోనే అసెంబ్లీలో కూడా మాట్లాడటం అవివేకమన్నారు. ఇక జీవి స్వగ్రామమైన ఈపూరు మండలం ఇనుమళ్ళ గ్రామంలో ఇది ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు బోర్డు పెట్టినప్పటికీ, దీన్ని దిక్కరించి ఎమ్మెల్యే అండతో కొందరు భూములు స్వాధీనం చేసుకున్నారని బ్రహ్మనాయుడు ఆరోపించారు. అలాగే వినుకొండ మండలం జాలలపాలెం గ్రామంలో 50 ఏళ్ల క్రితం సర్వేనెంబర్ 68. 1,2 లో 50 కుటుం బాలు 1967లో ప్రభుత్వ పట్టాలు పొంది ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్నారని, అయితే ఇప్పుడు ఆ స్థలం ప్రభుత్వ భూమి అంటూ ఇల్లు ఖాళీ చేయాలని, ఒకరి అవసరం కోసం ప్రభుత్వం ఎస్సీ కుటుంబాలపై ఒత్తిడి చేస్తున్నదని, దినిపై పెద్ద ఎత్తున తాము ఆందోళన చేపడతామని బ్రహ్మనాయుడు హెచ్చరించారు. అయితే గత ఎన్నికలకు ఆ ఎస్సీ కుటుంబాల వారు వైసీపీకి ఓటు వేశారన్న కక్షతో ఈ దారుణానికి తెగబడుతున్నారు అన్నారు. ఇక రెవెన్యూ, వ్యవసాయ శాఖ, రైతు భరోసా కేంద్రాలలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో వైసిపి వర్గానికి చెందిన ప్రజలు, రైతులు వెళితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బొల్లా ఆరోపించారు. ఇక అన్ని సొసైటీ కేంద్రాలలో ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్ళిపోతున్నాయని, అలాగే ఫలానా కంపెనీకి చెందిన ఎరువు గుళికలు విక్రయిస్తేనే యూరియా ఇవ్వండి మిగతా ఎరువులు అమ్మండి అంటూ ఎరువులు డీలర్లపై, వ్యవసాయ శాఖ అధికారులపై కొందరు ఒత్తిడి తెస్తున్నారని బ్రహ్మనాయుడు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలు వస్తే, 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయో కూటమి ప్రబుద్ధులు తెలపాలన్నారు. ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు వైసీపీ కార్యాలయంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. గుర్రం జాషువా పేదరిక నిర్మూలనకు తమ కవితల ద్వారా ఎంతో చైతన్య పరచారన్నారు. కుల పీడనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రజల్ని చైతన్య పరచడంతో పాటు, దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పగడాల వెంకటరామిరెడ్డి, అధికార ప్రతినిధి సీనియర్ న్యాయవాది ఎం ఎన్. ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story:డబల్ ఇంజన్ సర్కార్ వారు మాట్లాడిన తీరు అహంకార పూరితంగా ఉన్నాయి)

