Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను వేధించడంలో యాక్టివ్ గా పని చేస్తున్న కూటమి సర్కార్..!

సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను వేధించడంలో యాక్టివ్ గా పని చేస్తున్న కూటమి సర్కార్..!

సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను వేధించడంలో యాక్టివ్ గా పని చేస్తున్న కూటమి సర్కార్..!

రాష్ట్రంలో ఎక్కడికక్కడ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు…

న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలిపే హక్కుకూడా లేకుండా ప్రజల ప్రాథమిక హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తూ, దుర్మార్గమైన పాలన సాగిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయకుడు మాట్లాడుతూ. సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసినవారిపై కూడా అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటిని ప్రశ్నించారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న వినుకొండ నియోజకవర్గానికి చెందిన అబ్బూరి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారని అక్రమ కేసు నమోదు చేయడం విడ్డూరమన్నారు. అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, పోలీస్టేషనుకు తరలించి ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ, వైసీపీ కార్యకర్తలు ను వేధించడం దారుణమన్నారు. కూటమి నేతలు పాలనను గాలికొదిలి అబద్దాలతో కాలం గడుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం జరుగుతున్నా ప్రశ్నిస్తా అన్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్న సామాన్యులను సైతం వదలకపోవడం విడ్డూరమన్నారు. కూటమి ప్రభుత్వంపై ఏడాది నుంచే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రజలను మోసగించారు. రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది, వ్యవసాయాన్ని గాలికొదిలేశారు, రైతులు రోడ్లెక్కారు, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఘోరంగా ఉంది, విపరీతమైన అప్పులు చేస్తూ ఆ డబ్బులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్ధితి, అడ్డగోలుగా దోపిడీ, విచ్చలవిడి అవినీతి, రోజుకో పేరుతో కొత్త కొత్త డ్రామాలు, చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. వినుకొండలో కూటమి నాయకులు మాఫియా ముఠాల్లా తయారయ్యారు.(Story:సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను వేధించడంలో యాక్టివ్ గా పని చేస్తున్న కూటమి సర్కార్..!)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!