అమర్ పాఠశాలలో హిందీ దివాస్ కార్యక్రమం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : పట్టణంలో ధర్మపురి రోడ్డు వద్ద ఉన్న అమర్ పాఠశాలలో సెప్టెంబర్ 14న జరిగే హిందీ దివస్ ను పురస్కరించుకొని శుక్రవారం డైరెక్టర్ వి. ఇందు మతి ఆదేశాలతో పాఠశాలలో హిందీ దివాస్ కార్యక్రమం ప్రిన్సిపల్ టి. రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వి ఇందుమతి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే హిందీపై ఆసక్తి వచ్చేందుకు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. హిందీ జాతీయ ప్రథమ భాషగా విశిష్టత పొందిందన్నారు. ప్రస్తుతం విద్యార్థులతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో కూడా మాట్లాడే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థి హిందీ భాష పై భయాన్ని వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఏ శారద, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు (Story:అమర్ పాఠశాలలో హిందీ దివాస్ కార్యక్రమం)

