కామ్రేడ్ సీతారామ్ ఏచూరి వర్ధంతి సభ…
న్యూస్ తెలుగు /వినుకొండ : సిపిఎం పార్టీ జాతియ ప్రధానకార్యదర్శి, పూర్వపు రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారామ్ ఏచూరి మృతి పార్టీ కి తీరని లోటు గా కనిపిస్తుందని పార్టీ వినుకొండ కమిటీ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు అన్నారు. సీతారామ్ ఏచూరి ప్రధమ వర్ధంతి సభ స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. బీజేపీ దేశావ్యాప్తంగా మతోన్మాద రాజకీయాలను నడుపుతున్న నేపథ్యంలో ఏచూరి పార్టీకి దూరంకావడం దురదృష్టకరం అన్నారు. విద్యార్థి దశనుండి అంచలంచలు ఎదిగిన ఏచూరి జాతీయ కార్యదర్శి స్థాయికి ఏదిగారాని కొనియాడారు. కార్యక్రమంలో కే హనుమంతరెడ్డి, ఎస్. కె.రంజాన్ బీ, ఎం తిరుమల లక్ష్మి, పి వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.(Story:కామ్రేడ్ సీతారామ్ ఏచూరి వర్ధంతి సభ…)

