మన గ్రోమోర్ తనిఖీ
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ టౌన్ పరిధిలోని పి.ఎ.సి.ఎస్ వినుకొండ ,మన గ్రోమోర్ వినుకొండ మరియు ఎరువులషాపును మండల వ్యవసాయ అధికారి జీ. వరలక్ష్మి గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రైతులకు యూరియా గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవసరం మేరకుమాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలని,రెండవ దఫా ఎరువుల వాడకంలో నానో యురియా మరియు నానోడిఏపి ఎరువులు వాడకం అలవాటు చేసుకోవాలని, తద్వారా వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని, పోషకాలు మొక్కకు సమర్థవంతంగా అందించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆరీప్ పాల్గొన్నారు.(Story :మన గ్రోమోర్ తనిఖీ )
