Home వార్తలు తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వేగవంతం చేయాలి

0

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వేగవంతం చేయాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టని లబ్ధిదారులతో గ్రౌండింగ్ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ వ్యాధులు, ఇందిరమ్మ ఇండ్లు సహా తదితరాంశాలపై కలెక్టర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి ఎంపీడీవోలతో వెబ్ ఎక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టని లబ్ధిదారులతో గ్రౌండింగ్ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మున్సిపాలిటీలలో చాలా నెమ్మదిగా గ్రౌండింగ్ సాగుతోందని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వార్డ్ ఆఫీసర్లతో లబ్ధిదారులందరినీ పిలిపించి గ్రౌండ్ చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా ఎంపీడీవోలు ఏపీఎంలతో సమన్వయం చేసుకొని లబ్ధిదారులకు స్వయం సహాయక బృందాల ద్వారా రుణాలు ఇప్పించే సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించాలని ఆదేశించారు. ఇటీవల డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించి తెలియజేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలో గ్రామాల్లో తాగునీటి ట్యాంకులు వారానికి ఒకసారి లేదా పది రోజులకు ఒకసారి శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్యాంకులకు సంబంధించి క్లీనింగ్ రిజిస్టర్ మైంటైన్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, ఎంపీడీవోలు అందరూ తమ పరిధిలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయా విద్యా సంస్థల్లో నీరు నిల్వ ఉండే ఆస్కారం లేకుండా, అదేవిధంగా పిచ్చి గడ్డిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. aసమావేశం లో డిఆర్డిఓ ఉమాదేవి, హౌసింగ్ డిఈ విఠోబా, డి డబ్ల్యు ఓ సుధారాణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story :ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వేగవంతం చేయాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version