ఘనంగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు సతీమణి మరియు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి పుట్టినరోజు వేడుకలు బుధవారం రాత్రి పట్టణంలోని ఆజాద్ నగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ముస్లిం మైనారిటీ అధ్యక్షులు చికెన్ బాబు, బిస్కెట్ వలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథులుగా టీఎన్‌టీయూసీ అధ్యక్షులు అక్బర్ బాషా, దావులూరి వీరాంజనేయులు, దావులూరి మునయ్య, పువ్వాడ కృష్ణ, మోటుపల్లి నరసింహారావు, అచ్యుత కోటేశ్వరరావు,షేక్ మౌలాలి, డబ్బాల సుభాని తదితరులు పాల్గొని లీలావతి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం లీలావతి కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.(Story : ఘనంగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి జన్మదిన వేడుకలు )
