Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఇంటి స్థలాలు అర్జీలు తీసుకోండి

ఇంటి స్థలాలు అర్జీలు తీసుకోండి

ఇంటి స్థలాలు అర్జీలు తీసుకోండి

న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు పట్నంలో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దాన్ని అమలు చేయాలని మండల తాసిల్దారులు ఇల్లు లేని పేదలందరూ సచివాలయాల దగ్గరికి వెళ్లి ఇళ్ల స్థలాలకు అర్జీలు పెట్టుకోవాలని చెబుతున్నప్పటికీ, గ్రామ సచివాలయాల్లో అర్జీలు పెట్టుకోవడానికి వచ్చిన లబ్ధిదారులను అధికార పక్ష నాయకులు అడ్డు తగులుతూ సచివాలయం సిబ్బందుల్ని, అధికారి పక్ష నాయకులు బెదిరిస్తున్నారని వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పేద ప్రజలు ఇళ్ల స్థలాలు కోసం సచివాలయాలకు వెళ్లి అర్జీలు పెట్టుకుంటే బ్రాహ్మణపల్లికి సంబంధించిన అధికార పక్ష నాయకులు మీకు అసలు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎవరు చెప్పారు. ఇళ్ల స్థలాల్లో ఏమీ లేవు ఎల్లిపోండని అర్జీలు పెట్టుకోవడానికి వచ్చిన ప్రజల పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఈ విషయాన్ని సిపిఐ నాయకులు దృష్టికి బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీవాసులు తీసుకురాగా, ఈ విషయం కనుక్కుందామని బ్రాహ్మణపల్లి సచివాలయం దగ్గరికి సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, వినుకొండ మండల పార్టీ కార్యదర్శి కొప్పరపు మల్లికార్జున సచివాలయం దగ్గరికి వెళ్లి గవర్నమెంట్ ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకోమని చెప్పింది కదా మీరు ఎందుకు అర్జీలు తీసుకోవట్లేదని సచివాలయం సిబ్బందిని అడిగితే, సిబ్బంది మాత్రం మెదలకంగా ఉండి గ్రామంలో ఉన్న అధికార పక్ష నాయకులు ఇక్కడ ఇళ్ల స్థలాలు లేవని, ఇళ్లస్థలాలు ఎవరని ఏదైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలని, మమ్మల్ని సంప్రదించకుండా సచివాలయాల దగ్గరకు వస్తే అర్జీలు తీసుకోరని, సచివాలయం సిబ్బందిని బెదిరించి ప్రజల చేత అర్జీలు తిరస్కరించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేమని సిపిఐ నాయకులు సచివాలయం అధికారులు ప్రశ్నిస్తే మా దేమీ లేదండి అధికార పక్ష నాయకులు చెబితేనే మేము అర్జీలు తీసుకుంటాం లేకపోతే మేము తీసుకోమని, సచివాలయం లోపలి నుంచి బయటికి వెళ్లిపోయి బయట చెట్ల కింద సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూర్చున్నారు. దీనిపైన సిపిఐ నాయకులు స్పందిస్తూ సచివాలయం సిబ్బందికి నిరసనగా సచివాలయం గోడకు ఇళ్ల స్థలాల అర్జీలను అతికిచ్చి నిరసన తెలియజేశారు. ఈ సమస్యను సచివాలయం సిబ్బంది వెంటనే పరిష్కరించకపోతే ఇళ్ల స్థలాల లబ్ధిదారులు తీసుకొని కలెక్టర్ ని కలిసి వారికి వీరి సమస్యలను వివరిస్తామని బూదాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story:ఇంటి స్థలాలు అర్జీలు తీసుకోండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!