Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆధునిక సాంకేతికతను రైతులు ఉపయోగించుకోవాలి

ఆధునిక సాంకేతికతను రైతులు ఉపయోగించుకోవాలి

ఆధునిక సాంకేతికతను రైతులు ఉపయోగించుకోవాలి

న్యూస్ తెలుగు /సాలూరు:  వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను రైతులు ఉపయోగించుకొవలని  సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ అన్నారు. బుధవారం సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో సాలూరు మండలం , పాచిపెంట మండలం, మక్కువ మండలం గిరిజన రైతులకు100 శాతం రాయితీపై కంది, రాగులు విత్తనాలు పంపిణీ చేశారు అదేవిధంగా బంగారమ్మ రైతు మిత్ర సంఘం తోనాం గ్రామం సాలూరు మండలం మరియు శ్రీ పైడితల్లమ్మ గ్రూపు మాతమూరు గ్రామం పాచిపెంట మండలం కు, 80 శాతం రాయితీ డ్రోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు పొడు భూముల్లో పొలం గట్లపై కంది పంట వేసుకొని అదిక లాభాలు సాధించాలని అన్నారు. పోడు భూముల్లో రాగులు వేసుకోవాలని అన్నారు. రానన్న కాలంలో రైతులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని అధిక లాభాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల గిరిజన రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ సాలూరు వ్యవసాయ సంచాలకులు సత్యవతి, సాలూరు వ్యవసాయ అధికారి శిరీష, మరియు మూడు మండలాల పార్టీ ప్రెసిడెంట్లు,నాయకులు రైతులు,వ్యవసాయ అధికారులు,వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. (Story:ఆధునిక సాంకేతికతను రైతులు ఉపయోగించుకోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!