ఐ.టి.ఐ లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూస్ తెలుగు / వినుకొండ : 10 వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా ఐ.టి.ఐ.లో చేరవచ్చుని శ్రీ బాలాజీ ఐ.టి.ఐ కళాశాల ప్రిన్సిపాల్ కర్రి వెంకట్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వినుకొండ లోని నరసరావుపేట రోడ్డులో గల శ్రీ బాలాజీ ఐ.టి.ఐ. కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఐ.టి.ఐ. లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 2025 జూలై 23 వ తారీకున జరగబోయే 02 వ విడత కౌన్సెలింగ్ కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు 2025 జూలై 15 వ తారీకు సాయంత్రం 4 గంటల లోపు 10వ తరగతి మార్కుల లిస్ట్, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఐ.టి.ఐ. కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఐ.టి.ఐ. రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన వారు అదనంగా రెండు సబ్జెక్టులు రాసినట్లయితే న్యాస్ న్యూ ఢిల్లీ ద్వారా ఇంటర్మీడియట్ కు సమాన అర్హత గల సర్టిఫికెట్ పొందవచ్చునన్నారు. బ్రిడ్జి కోర్సు ఎంట్రన్స్ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా 2వ సంవత్సరంలో చేరవచ్చునని మరియు ఐటిఐ రెండు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఓపెన్ డిగ్రీ చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.
ఇతర వివరాలకు :- 9440542030,77028 92288, 8341821710, 8330962233, 8465819546, 9985307590, 6281559440 నంబర్ల కు సంప్రదించాలన్నారు. (Story:ఐ.టి.ఐ లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం)