ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక బీఈడీ కాలేజీలో సోమవారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షులు రామరాజు సభాఅధ్యక్షులుగా, జ్యోతి ప్రజ్వలన ప్రముఖ వేద పండితులు గుళ్ళపల్లి శివ శర్మ శ్రోతి, దేవలపల్లి చంద్రశేఖర శర్మ వేద ఆశీర్వచనంతో ప్రారంభమైన సమావేశం ప్రముఖుల ప్రసంగాల అనంతరం.. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా గాలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా వేదం హరిప్రసాద్, కోశాధికారిగా ఉమామహేశ్వరరావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన కార్యవర్గం జులై 13న నెల్లూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రస్తుత అధ్యక్షులు తెలియజేశారు. పదవీకాలం పూర్తయిన రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు వెంకటరామరాజు, కార్యదర్శి కార్యదర్శి కామేశ్వర ప్రసాద్, కోశాధికారి మంత్రి రాజు సత్యనారాయణ ని మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ముత్తనపల్లి శివరామకృష్ణ ప్రసాద్, కొత్తపల్లి అజయ్ తదితరులను మరియు రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యులను.. వివిధ జిల్లాల నుండి వచ్చిన సంక్షేమ సమాఖ్య కార్యవర్గ సభ్యులు, ఆతిధ్య పలనాడు జిల్లా కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ. జూలై 13న ప్రమాణ స్వీకారం అనంతరం వివిధ జిల్లాలలో సమావేశం ఏర్పాటు చేసి, వివిధ బ్రాహ్మణ సమస్యలను గుర్తించి, ప్రభుత్వం ద్వారా మరియు తమ శక్తి వంచన లేకుండా బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన గాలి రమణ, పీవీ.సురేష్ బాబు, భాగవతం జనార్ధనాచార్యులు మరియు ఈ కార్యక్రమ నిర్వహకులు పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ శాఖ రాష్ట్ర సభ్యులు మంత్రి రాజు సత్యనారాయణ, గాలి శ్రీనివాసరావు, భాగవతుల రవికుమార్, జీవి మాధవరావు, దేవలపల్లి శేఖర్, ధూళిపాళ్ల నాగేశ్వరరావు, అందుగులపాటి శివ లను రాష్ట్ర నాయకులు ఘనంగా సన్మానించారు. (Story:ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక)