మాలలకు స్మశాన స్థలం కేటాయించాలని తాసిల్దార్ కు వినతి పత్రం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలోని మాలలకు స్మశాన స్థలం కేటాయించాలనీ మాల మహానాడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వినుకొండ తాసిల్దార్ సురేష్ నాయక్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్బంగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ మాట్లాడుతూ. జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ ఆదేశాల మేరకు ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటివరకు మాలలకు ప్రత్యేక స్మశానం కేటాయించక పోవటం చాలా బాధాకరమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి స్మశానం కేటాయించాలని కోరడం జరిగింది. తాసిల్దార్ స్పందించి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణ అధ్యక్షులు రాయిని చిన్న మాట్లాడుతూ. గతంలో ఎన్నోసార్లు తాసిల్దారుకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒక మనిషి చనిపోతే కనీసం పాతి పెట్టడానికి స్థలం లేకపోవడం చాలా బాధాకరమని, నేటికైనా మాలల స్మశాన వాటిక కొరకు అధికారులు స్థలాన్ని మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కొమ్మతోటి సుధాకర్, ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరరావు, గౌరవ సలహాదారుడు కొమ్మతోటి కృపయా, పట్టణ ఉపాధ్యక్షులు పైయర్థ అనిల్, దార చిన్న పాపారావు, ప్రధానకార్యదర్శి జ్యోతి మల్లికార్జున్, కార్యదర్శి అంబడిపూడి శ్రీనివాసులు, కోశాధికారి పెనుమాల రమేష్, గౌరవాధ్యక్షులు బిల్లా ఇశ్రాయేలు, మండల ప్రధాన కార్యదర్శి పిడతల రాజా, రాయని రాజా, దారా నరసింహారావు, ఉమ్మడి వెంకటేశ్వర్లు, మల్లబత్తిన విద్యాసాగర్, దార ఆనంద్, దారా హరీష్, దారా పెద్ద పాపారావు తదితరులు పాల్గొన్నారు. (Story:మాలలకు స్మశాన స్థలం కేటాయించాలని తాసిల్దార్ కు వినతి పత్రం )