యోగా తోనే సంపూర్ణ ఆరోగ్యం
న్యూస్ తెలుగు/చింతూరు : యోగా తోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.రత్న మాణిక్యం అన్నారు.11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం యోగాసనాల అభ్యసన చేపట్టారు. యోగాసనాలపై అవగాహన పెంచుకొని ప్రతిరోజు చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో ప్రశాంతమైన జీవన విధానాన్ని పెంపొందించుకో వచ్చునన్నారు.ఈ కార్యక్రమంలో వైస్. ప్రిన్సిపల్ ఎమ్.శేఖర్, అధ్యాపకులు జి.వెంకట్రావు,డా.వై.పద్మ,ఎస్.అప్పనమ్మ,కె. శకుంతల,జి.హారతి, కె.శైలజ, ఎమ్.నాగ మోహన్ రావు, ఆర్.మౌనిక, యన్ వి వి యస్ యన్ మూర్తి, సంగం నాయుడు, శీనయ్య,సుబ్బారావు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. (Story:యోగా తోనే సంపూర్ణ ఆరోగ్యం)

