ప్రభుత్వ విద్యాసంస్థలలో సమస్యలు పరిష్కరించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి పి.డి.ఎస్.యు, ఏ.ఐ.వై.ఎఫ్,డి.వై.ఎఫ్.ఐ విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులువెంకటేష్,కుతుబ్, రాఘవేంద్రలు మాట్లాడుతూ వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో వేలకు వేలు ఫీజుల దోపిడి చేస్తూ పాఠశాలలో పుస్తకాలు, బెల్టు,షూ, యూనిఫాములను విక్రయిస్తూ,విద్య హక్కు చట్ట ప్రకారం పేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను అందించకుండా ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్య తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి విద్యార్థులకు కావలసిన పుస్తకాలు,ఏకరూప దుస్తులు అందించే ఏర్పాట్లు చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, ఉన్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించి సరైన విద్యా బోధన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, పాఠశాల అభివృద్ధి కై, మరమత్తులకై మంజూరు చేసిన నిధుల అవకతవకల పై ఆడిట్ నిర్వహించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని కోర్యామన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధమన్నారు. (Story:ప్రభుత్వ విద్యాసంస్థలలో సమస్యలు పరిష్కరించాలి)