వినియోగదారులకు సొంత స్థలం తో పాటు విదేశీ ఫల సంపద ఏటోర్ వెంచర్స్ సి ఇ వో బి. నగేష్
న్యూస్‌తెలుగు/విజయనగరం : సొంత స్థలం తో పాటు విదేశీ ఫల సంపదను కూడా అందివ్వాలన్నదే తమ ధ్యేయమని ఏటోర్ వెంచర్స్ సీఈవో బి.నగేష్ అన్నారు. సోమవారం నగరంలోని స్థానిక రింగ్ రోడ్డు రాఘవ రత్న ఆర్కేడ్ లో ఎటోర్ సంస్థ కార్యాలయం నూతన బ్రాంచ్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా సొంత భూమిని కల్పిస్తూ అరుదైన వృక్ష సంపదను పెంపొందిస్తూ భూమితో పాటు ఆదాయాన్ని కూడా పెంచడమే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. అతి తక్కువ ధరలకే భూమిని విక్రయించి, 33 ఏళ్ల పాటు ఫలసాయం కూడా అందించి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే తమ అభిమతం అని వెల్లడించారు. కొనుగోలు చేసిన స్థలంలో శాండిల్ ఉడ్, డ్రాగన్ ఫ్రూట్స్, (రెడ్ అండ్ ఎల్లో కలర్),జపాన్ లో పండించే మియాజాకీ మామిడిపళ్ళ రకాలు వంటివి అనేక అరుదైన మొక్కలను పెంచి వాటి ఫలసాయాన్ని 50: 50 రేషియోలో స్థలం కొనుగోలుదారులకు అందిస్తామని చెప్పారు. గత కొన్నాళ్ళుగా తాము అందిస్తున్న సేవలకు గూగుల్ సంస్థ తమకు 4.9 రేటింగ్ ను అందించడం గమనించదగ్గ విషయమని అన్నారు. ఇప్పటికే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించిన తమ సంస్థ ద్వారా లక్ష ఆవులను పెంచి తద్వారా వచ్చిన పాల ఉత్పత్తులను విక్రయించి వాటిలో కూడా ఖాతాదారులకు వాటాలను పంచి పెడతామని తెలిపారు. ఇప్పటికే సరియపల్లి, సొట్టొడ వలస, ఇచ్చాపురం ప్రాంతాలలో ఈ తరహా ఎటోర్ సిటీస్ నెలకొల్పామన్నారు. కావున ఆసక్తి గలవారు అతి తక్కువ ధరలకే తమ వద్ద స్థలాన్ని కొనుగోలు చేసి, స్థలంతో పాటు ఫలసాయాన్ని కూడా పొందాలని అన్నారు. గతంలో కౌలుదారులు ఉండేవారని అదే రీతిన తాము కూడా కవులు పద్ధతిని అవలంబిస్తూ అనేక మందికి సహకారం అందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ బి.ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. (Story:వినియోగదారులకు సొంత స్థలం తో పాటు విదేశీ ఫల సంపద ఏటోర్ వెంచర్స్ సి ఇ వో బి. నగేష్)