శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో కానుగుల పూజిత కి హాస్టల్ ఫీజు
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ సమీపంలోని విఠంరాజు పల్లి పూజ్య శ్రీ హిమాలయ గురువు దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో ఎంబిబిఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కానుగుల పూజిత కి హాస్టల్ ఫీజు ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా 12, 000 శాంతి ఆశ్రమం ట్రస్ట్ ద్వారా డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాంతి అశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు పెండ్యాల మోహన్ రావు, కనిగండ్ల అనంత కోటేశ్వరరావు, పెండ్యాల పుల్లారావు, సురేష్, ముని రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. (Story:శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో కానుగుల పూజిత కి హాస్టల్ ఫీజు )