పోరాటాల ఫలితంగా అంగన్వాడీలు అనేక హక్కులు సాధించుకున్నాం
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ అంగన్వాడి టీచర్స్ &హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) వనపర్తి జిల్లా నాలుగో మహాసభలు సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది మహాసభల ప్రారంభ సూచకంగా జెండావిష్కరణను తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి ఆవిష్కరించి మాట్లాడుతూ అంగన్వాడి వ్యవస్థ ఏర్పాటు అయినప్పటినుండి అంగన్వాడీల పక్షాన నిరంతరం పోరాటం నిర్వహిస్తున్న సంఘం సిఐటియు అని సిఐటియు పోరాటాల ఫలితంగా అంగన్వాడీలు అనేక హక్కులు సాధించుకున్నారని అంగన్వాడీల విజయం అని ఆమె అన్నారు అంగన్వాడీలకు పోరాటాల ఫలితంగా వేసవి సెలవులు సాధించడం ఒంటిపూట బడులు సాధించడం అంగన్వాడి టీచర్స్ కు 2 లక్షలుహెల్పర్స్ కు1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ సాధించడం జరిగిందని అంగన్వాడి వ్యవస్థ ఏర్పడిన 40 సంవత్సరాలు అయిందని అనేక హక్కులను సాధించుకోవడం సిఐటియు పోరాట ఫలితమే అని ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో కనీస వేతనాలు 26 వేల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని అన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోడలుగా విభజించి హక్కులను అరంచి వేస్తుందని కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా ఈ నాలుగు కోడులను తీసుకువచ్చిందని ఈ నాలుగు లేబర్ కోడులకు వ్యతిరేకంగా జులై 9న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నారని ఈ సమ్మెలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు రాబోయే కాలంలో హక్కుల కోసం పెద్ద ఎత్తున అంగన్వాడీలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు జిల్లా సహాయ కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ జిల్లా ఉపాధ్యక్షులు కే సునీత తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శారద నారాయణమ్మ జిల్లా ఉపాధ్యక్షులు కవిత యూనియన్ జిల్లా కోశాధికారి జి రాధా జిల్లా నాయకులు సుమతి జ్యోతి వెంకటేశ్వరమ్మ నాగేంద్రమ్మ శారద విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. (Story:పోరాటాల ఫలితంగా అంగన్వాడీలు అనేక హక్కులు సాధించుకున్నాం)