రైతులకు పెట్టుబడి సాయం అందించాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం వినుకొండ మండలం రెవిన్యూ అధికారి, డిప్యూటీ తాసిల్దార్ మురళి కి రైతాంగ సమస్యల పై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ. అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు సమస్యలను పరిష్కరించాలని, ప్రతి ఏడాది పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి 5 లక్ష రూపాయలు వరకు పంట రుణాలు ఇవ్వాలని, మన రాష్ట్రానికి రుతుపవనాలు వచ్చిన సందర్భంగా రైతులకు కావాల్సిన అన్ని రకాల విత్తనాలను సన్నా చిన్న కారు రైతులకు 80 శాతం సబ్సిడీపై ఇవ్వాలని పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని చెక్ డ్యామ్ లను రిపేరు చేయించి రైతులకు సాగునీరు అందించాలని, అనేక అంశాలపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తాసిల్దార్ కి రైతాంగ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు లింగ రామయ్య, పెద్దారావు, ఓజేపల్లి రామాంజి, బాలస్వామి, వెంకటయ్య, అంజయ్య, శేషారావు, అప్పారావు, తదితర రైతు నాయకులు పాల్గొన్నారు. (Story: రైతులకు పెట్టుబడి సాయం అందించాలి)