Homeవార్తలుతెలంగాణమాజీ ఎమ్మెల్యే జయ రాములుకి అఖిలపక్ష ఐక్యవేదిక ఘన నివాళులు

మాజీ ఎమ్మెల్యే జయ రాములుకి అఖిలపక్ష ఐక్యవేదిక ఘన నివాళులు

మాజీ ఎమ్మెల్యే జయ రాములుకి అఖిలపక్ష ఐక్యవేదిక ఘన నివాళులు

న్యూస్ తెలుగు/వనపర్తి:బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన కీర్తిశేషులు, మాజీ ఎమ్మెల్యే జయ రాములు కి అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ నేతృత్వంలో.. జయ రాములు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు. వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో, జయరాములు ప్రజాప్రయోజన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు.జయరాములు అవినీతి లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారని, అధికారులకు ప్రజల కోసం పనిచేయించే ధైర్యం ఉన్న నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ఎర్ర బస్సులో ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలు పరిష్కరించారని, ఆయన కాలంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని నాయకులు కొనియాడారు. గత ఐదు సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్యవేదిక బడుగు వర్గాల గొప్ప నాయకులను గుర్తుచేస్తూ వర్ధంతులు, జయంతులు నిర్వహిస్తూ ప్రజలలో చైతన్యం రేకెత్తించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో మర్చిపోయిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకొని వీరి స్మరణ సభలను నిర్వహించడం గర్వకారణంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జయరాములు కుటుంబ సభ్యులతో పాటు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కళాకారుడు రాజారాం ప్రకాష్ బృందం, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టి జి ఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, టిడిపి జిల్లా నాయకులు కొత్త గొల్ల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, నాగరాజు, రామస్వామి, శ్రీను, విజేత రాములు, పెద్దమందడి అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, శ్రీశైలం, శ్రీరంగాపురం మేకల అశోక్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి,నాగరాజు, సాయి యాదవ్, మురళీకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story : మాజీ ఎమ్మెల్యే జయ రాములుకి అఖిలపక్ష ఐక్యవేదిక ఘన నివాళులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!