Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చారిత్రాత్మక నిర్ణయాలకు కడప మహానాడు వేదిక

చారిత్రాత్మక నిర్ణయాలకు కడప మహానాడు వేదిక

చారిత్రాత్మక నిర్ణయాలకు కడప మహానాడు వేదిక

కడప మహానాడు ఏర్పాట్లు పరిశీలించిన చీఫ్ విప్ జీవీ, బీటెక్ రవి

న్యూస్ తెలుగు/వినుకొండ  : కడపలో ఈనెల 27, 28.29వ తేదీల్లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు చారిత్రక నిర్ణయాలకు వేదిక కానుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వైసీపీ పాలనలో జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు కూడా నీళ్లు ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేసిన ఆయన వారికి లక్షల కోట్లు దోచుకోవాలనే ఆలోచన తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవన్నారు. ఆ పరిస్థితులు మార్చి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు కొత్త చరిత్ర రాస్తున్న వివరాలు కూడా మహానాడు వేదికగా వెల్లడి స్తామన్నారు. కడప నగర సమీపంలోని పబ్బాపురం వద్ద 150 ఎకరాల్లో జరగనున్న మహానాడు వేడుక ఏర్పాట్లను శనివారం చీఫ్‌విప్ జీవీ పరిశీలించారు. మహానాడు జనసమీకరణ కో-కన్వీనర్, పులివెందుల నియోజకవర్గ జనసమీకరణ ఇన్ ఛార్జిగా ఉన్న ఆయన పులివెందుల తెదేపా ఇన్ ఛార్జి బీటెక్ రవితో కలిసి మహానాడు ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ నెల 25 నాటికి ఏర్పాట్లు పూర్తి కానున్నట్లు తెలిపారు. అనంతరం మాట్లాడిన రైతుల తలసరి ఆదాయం పెంచే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్నారు. ఎన్టీఆర్ హయాంలోనే రాయలసీమలో అనేక ప్రాజెక్టులు చేపట్టి సాగునీరు అందించామన్న జీవీ తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలోనూ సీమ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వగలిగితే బంగారు పంటలు పండించగలుగుతారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ 43వ వార్షికోత్సవానికి మరో ప్రత్యేకత కూడా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో తొలిసారి కడప కేంద్రంగా మహానాడు జరుగుతుండటంతో రాయలసీమ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గతేడాది ఎన్నికల్లో 94%స్థానాల్లో కూటమి విజయం సాధిస్తే సీమ ప్రాంతంలో అత్యధిక స్థానాలు కౌవసం చేసుకున్నామని, దానికి కృతజ్ఞతగా కడప గడ్డపై మహానాడు పండుగ జరుపుకుంటుకున్నామని తెలిపారు. 29న జరిగే భారీ బహిరంగ సభకు లక్షల్లో రాబోతున్నారని వెల్లడించారు. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడంపై మహానాడు వేదికపై సమగ్రంగా చర్చిస్తామన్నారు. అలాగే రాయలసీమ అభివృద్ధే లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్ణయాలపైనా చర్చించనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై రూపొందించిన 14 ముసాయిదా తీర్మానాలు, నాలుగు ఉమ్మడి తీర్మానాల్ని చర్చించి ఆమోదించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు ఎం.రాంప్రసాద్ రెడ్డి,జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : చారిత్రాత్మక నిర్ణయాలకు కడప మహానాడు వేదిక )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments