వినుకొండ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ
న్యూస్ తెలుగు/ వినుకొండ : చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో వినుకొండ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే స్టేషన్ ఆవరణలో పేద వితంతువులకు మరియు పేదవారికి అన్నసంతర్పణ నిర్వహించారు. సొసైటీ సీఈవో ఎండి. రాజు, చేతుల మీదుగా అన్నం పొట్లాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ. వినుకొండ నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో పేదలకు, వితంతువులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అలానే పేద విద్యార్థులకు నోటు బుక్స్ మెటీరియల్స్, హాస్పిటల్ లో ప్రసవ మహిళలకు మెడికల్ కిట్లను త్వరలోనే అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వినుకొండ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సభ్యులు ట్రెజరర్ ఎం. రమేష్ బాబు, సెక్రెటరీ ఎం. ప్రవళిక, సభ్యులు ఎన్. బ్రహ్మయ్య, టి. వెంకటకృష్ణ, టి శ్రీను వీరాంజి, కే ఐజాక్, ,తదితరులు అన్న సంతర్పణ లో పాల్గొన్నారు. (Story:వినుకొండ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ)