నగరంలో పలు ప్రాంతాల్లో అగ్నిమాపక నివారణ పై అవగాహన
న్యూస్‌తెలుగు/అనంతపురం : అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమం లో బాగంగా అనంతపురం నగరంలోని పలు ప్రాంతాలలో ఏ డి ఎఫ్ ఓ లింగమయ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అందులో బాగంగా మొదటిగ టవర్ క్లాక్ సర్కిల్ నందు అగ్నిప్రమాదాలు జరిగిన యడల ఎటువంటి పరికరములు ఉపయోగించి అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు అని రకరకాల బ్రాంచి పైప్ ద్వారా డెమో నిర్వహించి నీటి ద్వారా ప్రదర్శన చేసి ప్రజలకు అవగాహన కల్పించదమైనది మరియు కరపత్రాలు అందజేశారు.. అగ్నిమాపక సకటముల ద్వారా రైల్వే స్టేషన్ కి చేరుకొని అక్కడ ప్రజలకు మరియు అక్కడి సిబ్బందికి స్టేషన్ మాస్టర్ కి ఎలెక్ట్రికల్ ఫైర్ మరియు గ్యాస్ ఫైర్ జరిగిన యడల సి ఓ 2 ద్వారా ఏవిధంగా వాటిని నివారించవచ్చు, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా కాపాడవచ్చును అనునటువంటి అవగాహన కల్పించారు. అక్కడి ప్రజలు మరియు సిబ్బంది ఇలాంటి ఎన్నో రకాల అగ్నిమాపక నివారణ చర్యలు గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రాణ మరియు ఆస్తి నష్టాలను కాపాడుకోవచ్చునని తెలియజేయడమైనది అలానే ఫైర్ సిబ్బందిని మరియు సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ని అభినందించారు. ఆర్ టి సి బస్సు డిపో డీజిల్ బంకు నందు మరియు బస్ డిపోలోని సిబ్బందికి ఆయిల్ ఫైర్ జరిగినయెడల ఎలా ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా మంటలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పుడే డే డీసీపీ ఎక్సింగ్ విషర్ ద్వార మంటలను ఎలా అదుపు చేసుకోవలెను అని అవగాహన కల్పించారు.ఈ అవగాహన సదస్సులో అగ్నిమాపక సిబ్బంది
కే. కృష్ణ కుమార్ ఎల్ ఎఫ్, ఎస్. రమేష్ కుమార్ రెడ్డి ఎల్ ఎఫ్, ఈ.ఈరేష్ గౌడ్ డి ఓ పి, యూ. బాగా రెడ్డిఎఫ్ ఎం జీ. తిప్పే సామి ఎఫ్ ఎం లు ఏ. వంశీకృష్ణ ఫస్ఎఫ్ .రమేష్, సి. మధుసూదన, కే.జయరాముడు , కే. అనిల్ కుమార్ , బి. సుధాకర్, బి. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. (Story:నగరంలో పలు ప్రాంతాల్లో అగ్నిమాపక నివారణ పై అవగాహన)