ప్రతి విద్యార్థి చదువు తో పాటు సేవ భావంతో ముందుకు సాగాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : దేశభక్తిని పుణికి పుచ్చుకొని ప్రతి విద్యార్థి నిజాయితీ క్రమశిక్షణతో ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి ముందుకు రావాలని, నేటి బాలలే రేపటి భారత పౌరులని ప్రధానోపాధ్యాయురాలు పి. హవీలా పిలుపు నిచ్చారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా మంగళవారం మంగళవారం వినుకొండ బాలుర ఉన్నత పాఠశాలలో భారత స్కౌట్ అండ్ గైడ్స్ ట్రూప్ యూనిట్ను హెచ్ఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కౌట్ వ్యవస్థాపకుడు బైడెన్ పావెల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తొలి బ్యాచ్ లోని 26 మంది విద్యార్థులకు స్కౌట్ యూనిఫామ్ దుస్తులు అందజేసి స్కౌట్ విధి విధానాలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ మాస్టర్ పీడి. కే .ఉదయరాజు, టీచర్లు డి. జ్యోతి, ఏ. విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రతి విద్యార్థి చదువు తో పాటు సేవ భావంతో ముందుకు సాగాలి)