వినియోగంలోకి వచ్చిన జిల్లా పోలీసు సాయుధ దళ నూతన కార్యాలయ భవనం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ చొరవతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయ భవనం పని పూర్తి చేసుకొని వినియోగంలోకి వచ్చింది.
నేపథ్యంలోకి వెళితే కొత్త జిల్లాలు ప్రారంభమైనప్పటి నుండి సాయుధ దళ కార్యాలయాన్ని వనపర్తి రెడ్డి సేవా సమితి సంఘ భవనంలో తాతకాలికంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 88 వేలు అద్దె చెల్లించడంతో పాటు సాయుధ పోలీసులు విధులు నిర్వహించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ కి తెలిసింది. నూతన పోలీసు సాయుధ దళ భవనం నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపిఎస్ ప్రత్యేక చొరవ తీసుకొని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఐఏఎస్ గారితో చర్చించారు. కలెక్టర్ నిధులనుండి 10 లక్షల రూపాయలు , పెబ్బేరు షుగర్ ఫ్యాక్టరీ 2లక్షల 50వేల రూపాయల సహకారంతో సాయుధ దళ కార్యాలయ నూతన భవనం యొక్క మిగతా నిర్మాణం పూర్తి చేయించారు. అత్యాధునిక హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి సాయుధ పోలీసు అధికారులకు,సిబ్బందికి కానుకగా ఏప్రిల్ నెల 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర డిజిపి డా” జితేందర్ ఐపీఎస్ గారితో ప్రారంభింపజేశారు.
ఈ సందర్భంగా గురువారం పోలీసు సాయిధ దళ కార్యాలయ అధికారులు, సిబ్బంది పోలీసు సాయిధ దళ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక చొరవతో చూపిన జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ గారికి పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, హోమ్ గార్డ్ సిబ్బంది, తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఎస్పీ ని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు సాయుధ దళ అదనపు ఎస్పి, వీరారెడ్డి, వనపర్తి జిల్లా ఇన్చార్జ్ అదనపు ఎస్పీ, ఉమామహేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : వినియోగంలోకి వచ్చిన జిల్లా పోలీసు సాయుధ దళ నూతన కార్యాలయ భవనం)