బియ్యం నిల్వకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : రేషన్ దుకాణాల్లో తప్పనిసరిగా బియ్యం నిల్వకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించడమే కాకుండా, రేషన్ కార్డుదారులు సన్న బియ్యం తీసుకున్న తర్వాత వారికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా కేంద్రంలోని బండార్ నగర్ లో ఉన్న 19వ నెంబర్ రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీపై డీలర్ తో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ దుకాణాల్లో తప్పనిసరిగా బియ్యం నిల్వకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించడమే కాకుండా, రేషన్ కార్డుదారులు సన్న బియ్యం తీసుకున్న తర్వాత వారికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతోనే, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని, కాబట్టి పకడ్బందీగా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పారు. (Story : బియ్యం నిల్వకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించాలి)