గుత్తేదారుల కోసమే రైతులను నష్టపరుస్తూ గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఏదుల రిజర్వాయర్ నుండి రైతుల భూములకు నష్టం కలిగిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ 1800కోట్లతో ప్రతిపాదనలు రూపొందించడం దుర్మార్గమైన చర్య అని ప్రజలు తిరగబడి ఈ ప్రతిపాదనకు అడ్డంపడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం ఎదుల మండల కేంద్రంలో కార్యకర్తల కోలాహలం, మహిళల స్వాగతాలతో ఘనంగా జరిగింది.ఇట్టి సమావేశములో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకు తలమానికంగా ఏదుల రిజర్వాయర్ కెసిఆర్ గారి ఆశీర్వాదంతో పూర్తి చేసినామని అదేవిధంగా కల్వకుర్తి,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల అనుసంధానంతో కరువు పారద్రోలవచ్చని 600కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేసివుంటే ప్రాజెక్ట్ పూర్తి అయ్యేదని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లాలోని 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 100కోట్లతో రిజర్వాయర్ నుండి మేడికొండ వాగు ద్వారా దిండికి నీళ్లు తరలించి 2లక్షల ఎకరాలకు సాగు నీళ్ళు ఇవ్వవచ్చని కానీ అవగాహన లేక కేవలం కమీషన్ల కోసం ఏదుల మండలాన్ని తెచ్చింది నేనైతే మంది చేసిన పనులకు కాంగ్రెస్ నాయకులు మంగళారతులు పడుతున్నారు. ఎదుల మండలాన్ని పట్టుబట్టి కె.సి.ఆర్ గారిని ఒప్పించి తెచ్చింది ముమ్మాటికి తానేనని అవగాహన లేని నాయకులు ఎంపీడీఓ కార్యాలయం స్థానికి ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన తర్వాత ఏర్పాటు అవుతుందన్న కనీస జ్ఞానం లేని కాంగ్రెస్ వాళ్ళు తాము మండలం తెచ్చినామని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. మంచిచేసే కె.సి.ఆర్ గారిని మరచి మాయమాటలు చెప్పే రేవంతును నమ్మి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రస్థానం భావితరాలకు స్పూర్తి కలిగించాలని బి.ఆర్.ఎస్ రజతోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగిందని కాబట్టి ప్రజలు తమ ఇంటి పండుగగా బావించి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు .ఈ సమావేశములో నాగం.తిరుపతి రెడ్డి ,జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,దొడ్ల.రాములు,మాజీ సర్పంచులు ఇందిర,లాసింగ్,నరసింహ రెడ్డి,రమేష్ నాయకులు శివ లక్ష్మణ్,శంకర్ రెడ్డి,తిరుపతి రెడ్డి,హుసేన్, బుచ్చి రెడ్డి,సుల్తాన్,హనుమంతు యాదవ్,ప్రవీణ్ కుమార్ రెడ్డి,సునీల్,కృపాకర్ రెడ్డి, బంకల.స్వామి, ఉషణ్ణ యాదవ్,విష్ణు తదితరులు పాల్గొన్నారు. (Story : గుత్తేదారుల కోసమే రైతులను నష్టపరుస్తూ గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన)