అటహాసంగా డాక్టర్ హనెమాన్ జయంతి వేడుకలు
నమ్మకమైన హోమియో వైద్యం పై విస్తృత అవగాహన కల్పించాలి
డాక్టర్ పోగుల కుమారయ్య, డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు పిలుపు
న్యూస్‌తెలుగు/ అనంతపురం : ప్రపంచ మానవాళికి దుష్ప్రభావం లేని నమ్మకమైన వైద్యం అందించిన డాక్టర్ హనెమాన్ 270 వ జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. గురువారం స్థానిక సప్తగిరి సర్కిల్ లోని బల్ల కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్రీయ మెడికల్ ఆయుష్ అసోసియేషన్ (రామ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ పోగుల కుమారయ్య అధ్యక్షత వహించారు. రామ సదరన్ స్టేట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ వీరబోయిన నాగేశ్వరరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు సమన్వయం చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాని నవోమి ఆలపించిన పాట ఎంతగానో ఆకట్టుకుంది. చిన్నారి శ్రీనిధి చేసిన యోగాసనాలు అబ్రచాయి. శ్రీనివాస డయాగ్నస్టిక్ సెంటర్ వారు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మానవసేవే మాధవ సేవగా భావించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి వైద్య విధానాన్ని కనుగొన్న మహోన్నత వ్యక్తి డాక్టర్ హనెమాన్ అని కొనియాడారు. అలోపతి వైద్యానికి ఆయుష్ వైద్యానికి ఉన్న వ్యత్యాసం గురించి చక్కగా వివరించారు. హోమియోపతి నమ్మకమైన వైద్యమని.. వైద్యం పట్ల ప్రజల్లో మరింత చైతన్యాన్ని పెంపొందించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డాక్టర్ పోగుల కుమారయ్య, తిరుపతి నాయుడు లు పిలుపునిచ్చారు. అనంతరం విశిష్ట అతిధి డాక్టర్ వీరబోయిన నాగేశ్వరరావు, రామ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోగుల కుమారయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తిరుపతి నాయుడు, డాక్టర్ శాంతిప్రియ లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతి ప్రియ రాష్ట్ర మహిళా విభాగం కోఆర్డినేటర్, డాక్టర్ ఎన్. ఏ ఎన్.మాలిక్, డాక్టర్ పోగుల నాగేంద్రబాబు, డాక్టర్ శ్రీనివాస నాయక్ జిల్లా అధ్యక్షులు, డాక్టర్ చంద్రమౌళి జిల్లా ఉపాధ్యక్షులు, డాక్టర్ మురళీకృష్ణ జిల్లా ట్రెజరర్, డాక్టర్ షేక్షావలి, డాక్టర్ నరసింగరావు, డాక్టర్ వీక్షిత.
జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, జిల్లా నాయకులు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ నజీమ్, డాక్టర్ వనిత. డాక్టర్ ఆనంద్. డాక్టర్ మమత. డాక్టర్ హర్ష ప్రసాద్. డాక్టర్ నాగరాజు. డాక్టర్ అమృత తదితరులు ప్రసంగించారు. సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షులు, రమణ, శ్రీ ప్రణవ లీల రాజ్య లక్ష్మమ్మ ఆశ్రమము అధ్యక్షులు, పరుచూరి సూర్యప్రకాశరావు, పీజీ నాగభూషణం, సూర్యనారాయణ, మారుతి, రామ సుబ్బన్న, కోటిరెడ్డి, అల్లా బకాస్, సద్గురు పీఠం సేవా కేంద్రం సభ్యులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. (Story : అటహాసంగా డాక్టర్ హనెమాన్ జయంతి వేడుకలు)