రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఉగాది పురస్కారాలు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో వినుకొండ లోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు గుర్రం జాషువా కళాపరంగణంలో దిస్వసు సంవత్సరం ఉగాది పురస్కారాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ అధ్యక్షులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మందికి రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ దస్తగిరి తెలుగు సాంప్రదాయ దినోత్సవం లలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు కూచిపూడి నృత్య శిక్షకురాలు శ్రీమతి రేవతి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, వినుకొండ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్.వి.రామన్, రిటైర్డ్ ఎంఈఓ చిలకల జాన్సుందర్రావు, పల్నాడు జిల్లా క్యాటరర్స్ అసోసియేషన్ కార్యదర్శి మాడిశెట్టి అంకారావు, ఇంగ్లీష్ లెక్చరర్ ఎస్.కె కరిముల్లా, గణిత ఉపాధ్యాయుడు గుమ్మ అంజిరెడ్డి, సామాజిక సేవకులు గుమ్మడి వెంకటేశ్వరరావు, మెడికల్ డిపార్ట్మెంట్ శ్రీమతి ముప్పాళ్ళ అశ్వినికి సన్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి, సెక్రెటరీ వైవి నారాయణ, ఆళ్ల శ్రీనివాసరావు, కూచి కూచి రామాంజనేయులు, ఎస్.కే. బాజీ, సాధినేని శ్రీనివాసరావు, ముత్తినేని గిరిబాబు, షేక్ షకీల, ముప్పాళ్ళ రమేష్, మేఘన రాజారెడ్డి, బెజ్జం వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.(Story : రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు)