బనకచర్ల ప్రాజెక్టుకు గుర్రం జాషువా జలాశయం పేరు పెట్టాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో వివిధ సంఘాల తోటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బండ్ల మోటు వద్ద ఏర్పడే బనకచర్ల ప్రాజెక్టుకు జాషువా జలాశయం పేరు పెట్టాలని వివిధ సంఘాల వారు విజ్ఞాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బండ్లమోటు లెడ్ మైన్ లో పనిచేసి రిటైర్ అయిన ఎం.హెచ్.ప్రసాద్ మాట్లాడుతూ.. వినుకొండ నియోజకవర్గంలో పుట్టి విశ్వనరుడిగా పేరుగాంచిన కవి కోకిల గుర్రం జాషువా పేరు వచ్చేలా బనకచర్ల జలాశయానికి జాషువా జలాశయంగా నామకరణం పెట్టాలని కళా సంఘాల ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్, మాల మహానాడు నాయకులు కీర్తి పాటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ సతీమణి షకీలా, జాషువా సాంస్కృతిక సమాఖ్య కమలారామ్, గుమ్మడి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ జయ బాబు, మల్లికార్జున రావు, హబీబ్ భాషా, తదితరులు పాల్గొన్నారు.(Story : బనకచర్ల ప్రాజెక్టుకు గుర్రం జాషువా జలాశయం పేరు పెట్టాలి )